ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు
(AP STATE SYMBOL)
రాష్ట్ర చిహ్నం (AP symbol)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక (AP symbol) చిహ్నం: పూర్ణకుంభం
- 1956లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,500 బుద్ధ జయంతి సందర్భంగా అశోక చక్రం మరియు నాలుగు సింహాల తలలతో పాటు అమరావతి స్థూపం యొక్క పూర్ణఘటాన్ని తన అధికారిక చిహ్నంగా స్వీకరించింది.
- చుట్టూ సూర్యకిరణాలతో నిండిన వృత్తాకార చక్రం మద్యలో నిధితో నిండిన పూర్ణ కలశం కలదు.
- “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” అనే పేరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఉంటాయి.
- దేవనాగరిక లిపి లో “సత్యమేవ జయతే” అనే పదం కలదు. నాలుగు సింహాల గుర్తు పీఠం మీద అశోక చక్రం కలదు.
- 2500 సంవత్సరాల నాటి అమరావతి బౌద్ధస్థూపంలోని పూర్ణఘటం బొమ్మ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం తయారు చేశారు.
- ఈ చిహ్నం మధ్యలో వున్న పూర్ణఘటం 1956 లో ప్రథమంగా వాడుకలోకి వచ్చినా తరువాత అనూహ్యంగా పూర్ణకుంభంగా మారిపోయి వాడబడింది.
- 2018 ఆగష్టు 15న తిరిగి పూర్ణఘటంగా వాడుట ప్రారంభమైంది.
- పూర్ణఘటం అంటే అక్షయపాత్ర. దీనిచుట్టూ తామరపూలు మొగ్గలు వున్నాయి.
- దీనిని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్రలో వుంది
ప్రస్తుత చిహ్నం (మార్పు)
- ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర. ఇది వృత్తాకారం రూపంతో మధ్యలో పూర్ణఘటం (అక్షయపాత్ర) కలిగివుంది.
- పూర్ణఘటం కింద మూడు సింహాల చిహ్నం ఉంటుంది.
- బాహ్య వలయం దిగువన “సత్యమేవ జయతే” అని తెలుగులో వుండగా, అంతర్ వలయాలలో పైన “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం”, కింద ఎడమ వైపున ANDHRA PRADESH (ఆంగ్ల లిపి), కుడి వైపున आंध्र प्रदेश (దేవనాగరిక లిపి) అని వుంది.
- ఆంధ్రప్రదేశ్ తెలుగులో ఒకే పదంగా వుండగా, ఇతర లిపులలో అంధ్ర, ప్రదేశ్ అని రెండు పదాలుగా ఉన్నాయి.
- 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 14 నవంబర్ 2018న అధికారిక పయోగం కోసం తన కొత్త చిహ్నాన్ని ఖరారు చేసింది.
- ప్రస్తుత చిహ్నం చుట్టూ మూడు వృత్తాలను కలిగి ఉంటుంది.
- లోపలి వృత్తంలో మధ్య లో నిధితో నిండిన పూర్ణ కలశం కలిగి వుంది .
- లోపలి వృత్తం పైన 48 పూసలు కలవు .లోపలి వృత్తం వెలుపల సూర్య కిరణాలను ప్రతిభింబించే ల ఆకులు గలవు .
- మధ్య వృత్తం పైన 118 పూసలు కలవు .బయటి వృత్తం పైన 148 పూసలు కలవు .
- బయటి వృత్తం వెలుపల అశోకుని నాలుగు సింహాలగుర్తు కలదు.
- లయన్ కాపిటల్ పీఠం పై మధ్య భాగం లో ధర్మ చక్రం ను కలిగి ఉంటుంది .ధర్మ చక్రానికి కుడివైపు వృషభం ఎడమవైపు గుర్రం కలవు .
- “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “అనే పేరును తెలుగు ,ఇంగ్లీష్ ,హిందీ భాషలలో ఉంటాయి .
- దేవ నాగరిక లిపి లో “సత్యమేవ జయతే ” అనే పదం తెలుగు భాష లో కలదు.
- చిహ్నాన్ని 24 మిమీ కంటే తక్కువ వ్యాసంకు తగ్గించకూడదు .
- నెల్లూరుకు చెందిన సూరిశెట్టి అంజినేయులు దీని రూపకర్త.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి:
- రామచిలక(రోజ్ రింగ్ పారాకీట్) శాస్త్రీయ నామం- సిట్టాకుల క్రామెరి.
- రామచిలుక రంగులతో ఆకర్షణీయంగా వుండే ఒక పక్షి.
- దీనిని పెంపుడు జంతువుగా కొంతమంది పెంచుతారు.
- సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి.
- ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) వర్గానికి చెందినవి. ఇవి ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి.
- వీటిని సిట్టసైనెస్ (pittacines) అని కూడా పిలుస్తారు.
- వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots), కాక్కటు (cockatoos) చిలుకలు.
- ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
రాష్ట్ర వృక్షం
- ఆంధ్రప్రదేశ్ (AP symbol) రాష్ట్ర వృక్షం: వేప చెట్టు. దీని శాస్త్రీయ నామం – Azadirachta indica , వేప చెట్టు మహెూగని కుటుంబానికి చెందినది.
- అజాడిరక్జాకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ లు.
- ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను పర్షియ లో అజాదిరజ్జా, నైజీరియాలో డొగొన్ యార్లొ, అరబిక్ లో మార్గోస, నీబ్, సంస్కృతము లో నిమ్ వృక్షము, కన్నడ లో నింబ, వేపు, వెంపు, బేవు, తమిళములో వెప్పం, మలయాళములో ఆర్య వెప్పు, భారత లైలాక్ అని పిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు:
- కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు. ఏంటిలోప్ సెర్వికాప్రా అనే శాస్త్రీయ నామం గల ఈ జంతువు ప్రధానంగా భారతదేశంలో నివసించినప్పటికీ, పాకిస్థాన్, నేపాల్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.
- దీనిని ఆంగ్లం లో బ్లాక్ బక్ అని అంటారు. కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి.
- ఇవి ముఖ్యంగా రకరకాల గడ్డిని, అప్పుడప్పుడు పండ్లను తింటాయి. అతి వేగంగా పరిగెత్తగలిగే జంతువులలో ఇది ఒకటి.
- సాధారణంగా ఇవి 15-20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.
- మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది.
- మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోధుమగంగులో ఉంటే, కడుపు, ఇంకా కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపురంగులో ఉంటుంది.
- ఆడ కృష్ణ జింకలు లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు.
- కృష్ణ జింకలు కూడా రక్షిత జంతువులు.
- భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్యప్రాణుల సంరక్షక చట్టం 1972′ ప్రకారం వీటిని వేటాడటం చట్టరీత్యా నేరమవుతుంది.
- హిందూ ధర్మానుసారం, “కృష్ణ జింక” చంద్రుని వాహనం. కృష్ణ జింక నివసించే స్థానములు పవిత్రమైన ప్రాంతములు.