మహిళా అంతరిక్ష ప్రయాణం : బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ రాకెట్
మహిళా అంతరిక్ష ప్రయాణం
ఏప్రిల్ 14న బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలను అంతరిక్షానికి పంపింది. ఈ బృందంలో గాయని కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, శాస్త్రవేత్త ఐషా బోవే తదితరులు ఉన్నారు. వారు కర్మన్ రేఖ దాటి జీరో గ్రావిటీ అనుభవించారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ స్పేస్‌మిషన్. ప్రయాణం 11 నిమిషాలు మాత్రమే. మహిళల పురోగతికి, స్ఫూర్తికరమైన ఘట్టంగా నిలిచింది. లారెన్ సాంచెజ్ నేతృత్వంలో జరిగిన ఈ యాత్ర, అంతరిక్ష పర్యటనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
-
ఏప్రిల్ 14న 6 మంది మహిళలు అంతరిక్ష ప్రయాణం చేశారు
-
బ్లూ ఆరిజిన్ కంపెనీ న్యూ షెపర్డ్-31 మిషన్ నిర్వహించింది
-
బృందంలో ప్రముఖులు: కేటీ పెర్రీ, గేల్ కింగ్, లారెన్ సాంచెజ్
-
రాకెట్ టెక్సాస్ నుంచి ప్రయాణించింది
-
కర్మన్ రేఖ దాటి తిరిగి భూమికి వచ్చారు
-
స్పేస్‌క్రాఫ్ట్ ఆటోమేటెడ్‌గా పనిచేసింది
-
11 నిమిషాల మిషన్‌లో జీరో గ్రావిటీ అనుభవించారు
-
లారెన్ సాంచెజ్ – మిషన్ లీడర్, జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్
-
యాత్ర లక్ష్యం: స్ఫూర్తిదాయకమైన మహిళా ప్రాతినిధ్యం
Keywords and Definitions:
-
కర్మన్ రేఖ: భూమి వాతావరణం ముగిసే, అంతరిక్షం ప్రారంభమయ్యే ఊహాత్మక సరిహద్దు (100 కి.మీ ఎత్తు).
-
జీరో గ్రావిటీ: ఆకర్షణ శక్తి లేని స్థితి – అంతరిక్షంలో అనుభవించే తేలికపాటి స్థితి.
-
స్పేస్ టూరిజం: వ్యాపార లక్ష్యంగా, సాధారణ ప్రజలకూ అందుబాటులో ఉండే అంతరిక్ష యాత్ర.
-
ఆటోమేటెడ్ స్పేస్‌క్రాఫ్ట్: యాంత్రిక నియంత్రణతో నడిచే అంతరిక్ష వాహనం – మానవ సహాయం అవసరం లేదు.
-
బ్లూ ఆరిజిన్: జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ.
Q&A Format :
-
What happened? – 6 మంది మహిళలు అంతరిక్షం వెళ్లారు.
-
Which company did it? – బ్లూ ఆరిజిన్ సంస్థ.
-
When did it happen? – 2025 ఏప్రిల్ 14.
-
Where was the launch? – వెస్ట్ టెక్సాస్, USA.
-
Who led the mission? – లారెన్ సాంచెజ్.
-
Whom did she go with? – మరో 5 మంది మహిళలతో.
-
Whose idea was it? – బ్లూ ఆరిజిన్ సంస్థ, లారెన్ కల కూడా.
-
Why was it special? – పూర్తిగా మహిళల-only అంతరిక్ష మిషన్.
-
Whether it was successful? – అవును, సఫలమైన ప్రయాణం.
-
How long was the trip? – సుమారు 11 నిమిషాలు.
Historic Facts:
-
1963లో వాలెంటినా తెరిష్కోవా తొలి మహిళగా అంతరిక్షం వెళ్లింది.
-
2025లో బ్లూ ఆరిజిన్ నిర్వహించిన మిషన్ పూర్తిగా మహిళలతో జరగడం మొదటిసారి.
-
లారెన్ సాంచెజ్ స్వప్నంగా ఉన్న ఈ మిషన్ స్ఫూర్తికర ఘట్టంగా నిలిచింది.
-
మహిళల ప్రాతినిధ్యం పెరగడం – అంతరిక్ష పరిశోధనలో ముందడుగు.
-
కర్మన్ రేఖ దాటి ప్రయాణించడాన్ని అంతరిక్ష యాత్రగా గుర్తిస్తారు.
న్యూ షెపర్డ్ రాకెట్
లారెన్ సాంచెజ్
- లారెన్ సాంచెజ్ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న జర్నలిస్ట్. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి, పైలట్, బెజోస్ స్థాపించిన ఎర్త్ ఫండ్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ కూడా.
- సాంచెజ్ ముగ్గురు పిల్లల తల్లి. లైసెన్స్ పొందిన హెలికాప్టర్ పైలట్. 2016లో ఆమె ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్’ సంస్థను స్థాపించారు. దీనిని పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు.
- హెలికాప్టర్ పైలట్‌గా ఆమె నైపుణ్యం, విమానయానంలో వ్యాపారవేత్తగా చేసిన కృషికి 2024లో ఎల్లింగ్ హాల్వోర్సన్ వర్టికల్ ఫ్లైట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం అందుకున్నారు సాంచెజ్.
ఐషా బోవే
- ఐషా బోవే బహమాస్‌కు చెందినవారు. నాసాలో మాజీ రాకెట్ సైంటిస్ట్, ఆంట్రప్రెన్యూర్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమాటిక్స్ (ఎస్‌టీఈఎం) శాస్త్రాల ప్రమోటర్ కూడా.
- ఆమె స్టెమ్‌బోర్డ్ అనే ఇంజనీరింగ్ కంపెనీకి సీఈవో. ఇది అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో రెండుసార్లు స్థానం దక్కించుకుంది.
- దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను నేర్పించే లక్ష్యంతో లింగో అనే కంపెనీని కూడా ఐషా ప్రారంభించారు.
అమండా
- అమండా ఒక బయోస్పేస్ రీసర్చ్ సైంటిస్ట్. హార్వర్డ్ పట్టభద్రురాలు. హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్‌లో పరిశోధనలు నిర్వహించారు.
- 1981 నుంచి 2011 వరకు నాసాలో రీయూజబుల్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్‌లో అమండా పని చేశారు. కెప్లర్ ఎక్సోప్లానెట్ మిషన్‌లో కూడా ఆమె భాగం పంచుకున్నారు.
- లైంగిక హింస నుంచి బయటపడిన వారి కోసం అందించిన సహాయ కార్యక్రమాలకు ఆమెను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కూడా చేశారు.
- 2022లో టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’గా కూడా అమండాను ఎంపిక చేసింది.
గేల్ కింగ్
- గేల్ కింగ్ ఒక జర్నలిస్ట్, అవార్డు విన్నర్.
- ఆమె ‘సీబీఎస్ మార్నింగ్స్’ కు కో-హోస్ట్, ఓప్రా డైలీకి ఎడిటర్-ఎట్-లార్జ్.
- ఆమె సిరియస్ఎక్స్‌ఎమ్ రేడియోలో ‘గేల్ కింగ్ ఇన్ ది హౌస్’ అనే షోను కూడా నిర్వహిస్తున్నారు.
- జర్నలిజంలో ఆమెకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది.
కేటి పెర్రీ
- కేటీ పెర్రీ పాప్ గాయని. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సింగర్. ఆమె ఆల్బమ్‌లు కాపిటల్ రికార్డ్స్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడయ్యాయి.
- కేటీ పాటల వీడియోలకు వందల కోట్ల వ్యూస్ ఉన్నాయి.
- మానవతా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొంటుంటారు.
- యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా పిల్లల హక్కుల కోసం ఉద్యమిస్తుంటారు కేటీ.
కెరియాన్ ఫ్లిన్
- ఫ్యాషన్, మానవ వనరుల రంగాలలో పనిచేశారు కెరియాన్ ఫ్లిన్.
- గత దశాబ్ద కాలంగా ది అలెన్-స్టీవెన్సన్ స్కూల్, ది హై లైన్, హడ్సన్ రివర్ పార్క్ వంటి స్వచ్ఛంద సంస్థలలో వలంటీర్‌గా చేశారు.
- హాలీవుడ్‌లోని మహిళల చరిత్రను అన్వేషించే దిస్ చేంజ్స్ ఎవ్రీథింగ్ (2018), లిల్లీ (2024) వంటి ఆలోచింపజేసే సినిమాలను నిర్మించారు కెరియాన్ .
ఆంధ్రలో సోలార్ శక్తి ప్రాజెక్ట్‌లు : solar projects in AP
Share this content: