×

CLIMATE OF ANDRA PRADESH – 1

0 0
Read Time:5 Minute, 45 Second

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి(CLIMATE OF ANDRA PRADESH )

ఆంధ్రప్రదేశ్ ఆయన రేఖామండలంలో ఉంది. అందువల్ల ఉష్ణమండల  లేదా ఆయనరేఖా మండలం శీతోష్ణస్థితిని ఉంటుంది . భారతదేశం మాదిరిగానే ఈ రాష్ట్రం శీతోష్ణస్థితి రుతుపవనాలపై ఆధారపడి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి ని సాధారణంగా ఆయన రేఖామండల రుతుపవన శీతోష్ణస్థితి అంటారు. ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం మొదలగు అంశాల దీర్ఘకాల సగటు ను శీతోష్ణస్థితి (Climate) అంటారు. ఒక రోజు లేదా కొన్ని రోజుల ఉష్ణోగ్రత, అర్ద్రత, అవపాతం మార్పులను వాతవరణం అంటారు.

ఆంధ్రప్రదేశ్లో మొత్తం 20 వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలను లెకిస్తాయి. అవి అనంత పురం , ఆరోగ్య వరం ,బాపట్ల ,గన్నవరం ,కడప ,కళింగపట్నం , కావాలి ,కర్నూల్ , మచిలీపట్నం, నందిగామ, నంద్యాల ,నర్సాపూర్ , నెల్లూరు , ఒంగోలు , రెంటచింతలు,తిరుపతి, తుని, విశాఖపట్నం-1,2,

మన రాష్టంలో 1602 వర్షపాత నమోదు పరికరాలు ,1173 గాలివేగం, పవన దిశ, ఆర్ద్రత కొలిచే పరికరాలు కలపు .713 పీడనాన్ని కొలిచే పరికరాలు, 86 గ్లోబల్ రేడియేషన్ కొలిచే పరికరాలు, 959 నేలలలోని తెమను కొలిచే పరికరాలు, 76 జలాషయాల స్థాయిని కొలిచేపరికరాలు, 5 సముద్ర పోటు పాటుల వివరాలను నమోదు చేసే పరికరాలు కలవు.

వాతావరణంలో గల ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణం యొక్క విలువను ఉష్ణోగ్రత అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము (CLIMATE OF ANDRA PRADESH – 1) యొక్క సగటు ఉష్ణోగ్రత 27 °C .గరిష్ట ఉష్ణోగ్రత 31.5°సి , కనిష్ఠ ఉష్ణోగ్రత 18°C, భూమిపై గల సాధారణ ఉష్ణోగ్రత 15సెల్సియస్,

భారతదేశం/ ఆంధ్రప్రదేశ్లోని సాంప్రదాయ ఋతువులు
  • 1. వసంతం : మార్చి -ఏప్రిల్
  • 2 .గ్రీష్మ : మే – జూన్
  • 3 .వర్ష : జూలై-ఆగస్టు
  • 4. శరద్ : సెప్టెంబర్- అక్టోబర్
  • 5. హేమంత:నవంబర్ -డిసెంబర్
  • 6 .శిశిర : జనవరి – ఫిబ్రవరి
వాతావరణశాఖ ప్రకారం ప్రస్తుత భారతదేశంలో 4 ఋతువులు ఉన్నాయి.

1. వేసవి కాలం : మార్చి జూన్
2. నైరుతి ఋతుపవనకాలం : జూన్- సెప్టెంబర్
3. ఈశాన్య ఋతుపవన కాలం : అక్టోబర్-నవంబర్
4. శీతాకాలం : డిసెంబర్ ఫిబ్రవరి

1.శీతాకాలం: సూర్యుడు

  • సూర్యుడు దక్షిణార్ధగోళంలో ప్రయాణించడం లేదా/ దక్షిణ దిశలో ప్రయాణించటం వలన ఉత్తరార్ధగోళం లేదా భారతదేశం,ఆంధ్రప్రదేశ్ పై సూర్యకిరణాలు ఏటవాలుగాపడి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
  • ఇలా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలాన్ని శీతాకాలం గాపేర్కొంటారు.
  • డిసెంబరు చివరి నాటికి రాష్ట్రం మొత్తం చల్లబడి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి.
  • ఈ ఋతువులో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు మిగతా జిల్లాల కంటే తక్కువు ఉష్ణోగ్రతతో ఉంటాయి.
  • ఈ జిల్లాలు మైసూరు పీఠభూమిని అనుకుని అధిక ఎత్తులో ఉండటమే దీనికి కారణం.
  • ఈ కాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు బోయలో ఉన్న లంబసింగిలో -2°C ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. లంబసింగి ని ఆంధ్రా కాశ్మీర్ అని పిలుస్తారు.
  • కోస్తా ప్రాంతం అంతటా రాత్రుల్లో మంచు బాగా కురుస్తుంది.
  • ఉష్ణోగ్రత విలోమం (Temperature Inversion) వల్ల కొన్నిరోజులు ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది.
  • ఈ కాలంలో కోస్తా జిల్లాల కంటే రాయలసీమ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి సముద్రానికి దూరంగా ఉన్నాయి కాబట్టి.
  • శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్ మాసంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడే స్థానిక శీతల పవనాలు ఆంధ్రప్రదేశ్ పైకివీచి రాష్ట్రమంతటా విస్తరించటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువస్థాయిలో నమోదవుతాయి.
  • శీతాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 29°C గాను, కనిష్ట ఉ ష్ణోగ్రత 12°C గాను నమోదవుతుంది.
  • శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ సాధారణ వర్షపాతం 15.7 మీ. మీ. ఆంధ్రప్రదేశ్లో (CLIMATE OF ANDRA PRADESH – 1) అత్యల్ప ఉ ష్ణోగ్రత నమోదయ్యే నెల: డిసెంబర్.

 

Rashtrakuta Empire రాష్ట్రకూటులు(క్రీ.శ.752-997)

happy CLIMATE OF ANDRA PRADESH - 1
Happy
0 %
sad CLIMATE OF ANDRA PRADESH - 1
Sad
0 %
excited CLIMATE OF ANDRA PRADESH - 1
Excited
0 %
sleepy CLIMATE OF ANDRA PRADESH - 1
Sleepy
0 %
angry CLIMATE OF ANDRA PRADESH - 1
Angry
0 %
surprise CLIMATE OF ANDRA PRADESH - 1
Surprise
0 %

Share this content:

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!