Breaking News

రైలు దిగుతూ ప్రమాదవశాత్తు చనిపోతే …. ?

Compensation For Death

  • Railway Compensation For Death : రైలు దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదే అని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.
  • బాధితులకు పరిహారం నిరాకరిస్తూ రైల్వే చేసిన వాదనను తోసిపుచ్చింది.
  • ఈ మేరకు రైలు దిగుతూ మృతి చెందిన ఓ ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది(Railway Compensation For Death).
  • మృతురాలి కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4లక్షలకు ఏడు శాతం వడ్డీ కట్టి ఆ మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు పరిహారం రూ.8లక్షలు కన్నా తక్కువ ఉంటే ఇదే మొత్తంలో అందించాలని తీర్పునిచ్చింది.

సెక్షన్ 124-ఏ

  • భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124-ఏ ప్రకారం ట్రైన్ నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు మరణించిన బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
  • ఈ కేసులో రైల్వే క్లైయిమ్స్ ట్రిబ్యునల్(ఆర్​సీటీ) ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
  • ‘మృతురాలి స్వీయ తప్పిదం కారణంగానే ప్రమాదానికి గురైనట్లు రైల్వే ట్రైబ్యునల్ నిర్ధరణకు వచ్చింది. అందుకే ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ట్రైబ్యునల్ తప్పు చేసింది.’ అని కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ పీ సందేశ్ తీర్పునిచ్చారు.

అసలేం జరిగింది ?

  • ఈనాడు కధనం ప్రకారం 2014లో జయమ్మ అనే మహిళ తన సోదరి రత్నమ్మతో కలిసి చెన్నపట్టణ రైల్వే స్టేషన్‌ కు వెళ్లింది. మైసూరులోని అశోకపురం వెళ్లేందుకు తిరుపతి ప్యాసింజర్ రైలు కోసం ఎదురుచూసింది.
  • పొరపాటున తన సోదరితో కలిసి ట్యూటికోరిన్ ఎక్స్​ప్రెస్ ఎక్కింది. తాను వేరే రైలు ఎక్కానని గ్రహించిన జయమ్మ కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించింది.
  • అప్పుడు ప్రమాదవశాత్తు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయింది.
  • దీంతో తమకు పరిహారం ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు రైల్వే ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు.
  • అందుకు రైల్వే ట్రైబ్యునల్ నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు.

మృతురాలు పొరపాటున వేరే రైలు ఎక్కిందని, దిగాలనుకున్నప్పుడు అలారం చైన్ లాగి ఉండాల్సిందని రైల్వే శాఖ తరఫు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అందుకే రైల్వే చట్టంలోని సెక్షన్ 123(ఈ) కింద ఎలాంటి పరిహారం అందించలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతురాలికి పరిహారం ఇవ్వాల్సిందేని తేల్చి చెప్పింది.

No Back to Paper Ballot : సుప్రీం కోర్టు

కర్ణాటక హైకోర్టు

Aspect Information
What కర్ణాటక హైకోర్టు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో అత్యున్నత న్యాయ అధికారం. ఇది రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది మరియు సివిల్ మరియు క్రిమినల్ విషయాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది.
Where బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
When భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన తరువాత 1956 నవంబరు 1 న స్థాపించబడింది. పూర్వం దీనిని మైసూరు హైకోర్టు అని పిలిచేవారు.
Who భారత రాష్ట్రపతిచే నియమించబడిన ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు అనేక ఇతర న్యాయమూర్తులు ఇందులో ఉంటారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు.
Why కర్ణాటక హైకోర్టు కర్ణాటక రాష్ట్రంలో న్యాయాన్ని నిర్వహించడానికి, చట్టాలను అర్థం చేసుకోవడానికి మరియు చట్ట పాలనను నిర్ధారించడానికి స్థాపించబడింది. రాజ్యాంగ హక్కులను కాపాడటంలో, న్యాయ వివాదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
How హైకోర్టు కర్ణాటకలోని దిగువ కోర్టుల నుండి అప్పీలు చేయబడిన కేసులను విచారిస్తుంది మరియు ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి రిట్ లు, ఉత్తర్వులు మరియు ఆదేశాలను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. ఇది వివిధ బెంచ్ ల ద్వారా పనిచేస్తుంది మరియు పిటిషన్లు మరియు అప్పీళ్ల వ్యవస్థ ద్వారా కేసులను విచారిస్తుంది.
  • కర్ణాటక హైకోర్టు భారతీయ న్యాయవ్యవస్థకు ఒక ముఖ్యమైన స్తంభంగా పనిచేస్తుంది,
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
What do you like about this page?

0 / 400