“మెగా డీఎస్సీ” – ఏ జిల్లాకి ఎన్ని పోస్టులో తెలుసా ?
“మెగా డీఎస్సీ” – ఏ జిల్లాకి ఎన్ని పోస్టులో తెలుసా? – జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! – MEGA DSC 2025
MEGA DSC 2025 : టీచింగ్, నాన్ టీచింగ్ ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ 2025 ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘X’ ద్వారా డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మెగా డీఎస్సీ పూర్తి సమాచారం, ప్రభుత్వ ఉత్తర్వులు, ఉపాధ్యాయ ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు.
ఒకటి కాదు రెండు కాదు 24 సార్లు – ఆఖరికి బ్యాంక్ జాబ్ కొట్టేశాడు
ఇదీ షెడ్యూల్
ఏప్రిల్ 20- మే 15 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు, 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు, రెండు రోజుల తర్వాత ప్రాథమిక ‘కీ’ విడుదల చేయడంతో పాటు ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. గడువు ముగిసిన మరుసటి రోజే తుది కీ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన
MEGA DSC 2025
జువెనైల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు
విశాఖ పట్నం జిల్లాలో ఎస్జీటీ 4, పీఈటీ 1, ఏలూరులో ఎస్జీటీ 6, పీఈటీ 1ఖాళీ, వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్జీటీ 3 ఖాళీలున్నాయి.
MEGA DSC 2025
జోన్ల వారీగా ఖాళీలు
ఏపీ రెసిడెన్షియల్, ఆదర్శ, సాంఘిస, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో పోస్టులు రాష్ట్ర, జోన్ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు పూర్తిగా రాష్ట్రస్థాయి క్యాడర్లో భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా 1718టీజీటీ పోస్టులున్నాయి. ప్రిన్సిపాల్ 52, పీజీటీ 273, పీడీ 13, పీఈటీ 172 ఖాళీలు భర్తీ చేయనున్నారు. దివ్యాంగ పాఠశాలల్లో బధిరుల పాఠశాలల్లో 11, అంధుల పాఠశాలల్లో 20 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
MEGA DSC 2025
జిల్లా స్థాయి పోస్టులు
ఇక జిల్లా స్థాయి పోస్టులు కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,645, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 446 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ పోస్టులు 5,945. ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,217, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సోషల్ 1,329, ఇంగ్లిష్ 1,032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పీఈటీ పోస్టులు 1,664 భర్తీ చేయనున్నారు.
- కర్నూలు 2645
- చిత్తూరు 1473
- తూ.గో. 1241
- కృష్ణా 1208
- గుంటూరు 1143
- ప.గో. 1035
- అనంతపురం 807
- విశాఖ పట్నం 734
- వైఎస్సార్ కడప 705
- నెల్లూరు 668
- ప్రకాశం 629
- శ్రీకాకుళం 458
- విజయనగరం 446
mega_dsc_2025
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు
గిరిజన ఆశ్రమ పాఠశాల్లోలని పోస్టులను జిల్లా స్థాయిలో భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 881 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జీటీలే అత్యధికంగా 601 పోస్టులున్నాయి. ఇందులో విశాఖపట్నంలో అత్యధికంగా 400, అత్యల్పంగా కడప, అనంతపురం జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి.